మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
· ముమ్మర ప్రచారంలో పాల్గొన్న తాండూరు నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ నేతలతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మనుగోడు నియోజకవర్గంలోని లకారం గ్రామంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఓటర్ల ఇంటింటికి వెళ్లి ఈవీఎంను ప్రదర్శించి కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, సర్కారు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, రాము, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌ రెడ్డి, పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మస్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల సర్సింలు, తాటికొండ పరిమళ్, పట్లోళ్ల బాల్ రెడ్డి, రొంపల్లి సంతోష్ కుమార్, బంటు మల్లప్ప, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ రెడ్డి, ఇందూరు ప్రకాష్, ముంబాపూర్ ప్రకాష్, మసూద్, జావిద్, మజర్ తదితరులు పాల్గొన్నారు.