సర్దార్ పటేల్ కృషితో అఖండ భారతం

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్దార్ పటేల్ కృషితో అఖండ భారతం
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ స్వాతంత్య్ర యోధుడు, భారత ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ కృషితో అఖండ భారతం ఏర్పడిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. సర్దార్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్లప్ప మడిగ సమీపంలో వద్ద నిర్వహించిన జయంతి వేడుకలలో రాజ్ కుమార్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలోని స్వదేశీ సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. భారత దేశ సమైక్యతను చాటిన మహనీయుడు అని, ఆయన కృషి వల్లే అఖండ భారతదేశం ఏర్పాటయ్యిందని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నాయకులు గడ్డం వెంకటేష్, సర్దార్ పటేల్ అసోషియేషన్ సభ్యులు కోటం సిద్ధలింగం, చల్లాహరికృష్ణ, రయోల్ రాజ్ కుమార్, యువనాయకులు వెంకట్ జుంటుపల్లి, రాము ముదిరాజ్, రజక నర్సింహులు, లక్ష్మణ్, బసు, మతిన్, మాధవ్, నరేష్, అజిత్, రాజు, సైద్ తదితరులు పాల్గొన్నారు.