బడికి, విద్యార్థులకు చేయూత అభినందనీయం
– సాయి తరుణ్ ఆసుపత్రి వైద్యులు డా. జయప్రసాద్
– శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ట్రస్ట్ ద్వారా బెంచీల వితరణ
– సైన్స్ ల్యాబ్ కోసం ట్రస్ట్ వైస్ చైర్మన్ రూ. 10వేల చెక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు, విద్యార్థులకు స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం(మల్ రెడ్డిపల్లి, తాండూరు) ట్రస్ట్ చేయూతనందించడం అభినందనీయని సాయి తరుణ్ ఆసుపత్రి వైద్యులు డా. జయప్రసాద్ అన్నారు. ప్రతీ యేడాది ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణం శ్రీ సరస్వతి శు మందిర్ పాఠశాలకు రూ. 45 వేల విలువైన 15 డబల్ డెస్క్ బెంచీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు సాయి తరుణ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జయప్రసాద్ సమక్షంలో అందజేశారు. అదేవి ధంగా ట్రస్ట్ వైస్ చైర్మన్ పరంధాములు పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కోసం తన వంతు సాయంగా రూ.10వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉన్నతవంతులను తయారు చేస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్ట్ చేయతూనందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీవీ శ్రీనివాస్, సద్గుణ రెడ్డి, ఉషారెడ్డి, ఉమేష్ సింగ్, బస్వరాజ్, పాఠశాల జిల్లా అధ్యక్షులు మల్లేశం, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పరిగి ప్రకాష్, అనంత్ రెడ్డి, ప్రభుశంకర్, ఆచార్యా, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

