బీసీ భవన్‌కు నిధుల మంజూరు హర్షణీయం
– టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు గద్దె శ్రీనివాస్ చారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్మించబోయే బీసీ భవన్‌కు నిధులు మంజూరు కావడం హర్షణీయమని టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు గద్దె శ్రీనివాస్ చారి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో నియోజకవర్గానికి రూ.134 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషితో సీఎం కేసీఆర్ జీఓ 369 కింద తాండూరు నియోజకవర్గానికి సీడీపీ ద్వారా నిధులు మంజూరు చేయించారని అన్నారు. ఇందులో తాండూరులో నిర్మించే బీసీ భవన్‌కు రూ. 2కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. అదేవిధంగా మిగతా నిధులలో బషీరాబాద్ మండలానికి రూ. 3కోట్లు, నియోజకవర్గంలోని 144 గ్రామాలకు 74 కోట్లు, మున్సిపల్‌లోని 36 వార్డులకు రూ. 36 కోట్లు, ఐటీఐ కాలేజీకి రూ. 3కోట్లు, కొత్త మార్కెట్ కమిటికి రూ. 10 కోట్లు, బంజార భవన్‌కు రూ. 1కోటి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అదనపు గదుల నిర్మాణానికి రూ. 1.50 కోట్లు కేటాయించడం గర్వించదగ్గవిషయం అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో తాండూరు అభివృద్ధిలో దూసుకపోవడం ఖాయమన్నారు.

