విద్యాభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యాభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం
– డిగ్రీ, ఐటీఐ కాలేజీలకు నిధులు మంజూరు హర్షణీయం
– సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గానికి సాధించిన రూ. 134 కోట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ. 1.50కోట్లు, ఐటీఐ కళాశాలకు రూ. 3 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని సోమవారం టీఆర్ఎస్వీ తాండూరు డివిజన్ ఇంచార్జ్ జిలానీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎం కేసీఆర్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సాధించిన నిధుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, ఐటీఐ కళాశాలకు నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయదేవి. సంగీత అజయ్ సింగ్ ఠాకూర్, కోఆప్షన్ సభ్యులు రాములు, టీఆర్ఎస్వీ వర్కింగ్ ప్రెసిడెంట్ మజర్, ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.