కాగ్నానదిని పూజిద్దాం రండి..!
– నేడు కోకట్‌లో మహా మంగళ హారతి
– తాండూరు ధర్మ జాగరణ సమితి పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాగ్నానదిని పూజిద్దాం రండి అంటూ ధర్మ జాగరణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. అతి ప్రాచీనమైన కాగ్నానదిని పూజించుకోవడం ధర్మమని తెలిపింది. నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా యాలాల మండలం కోకట్ గ్రామంలోని కాగ్నానదికి గంగా పూజ, దీపోత్సవం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాండూరు బ్రాహ్మణ అర్చక, పురోహితుల సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం 5-30గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కాగ్నానది ప్రస్తానం..
కాగ్నానది కృష్ణానది కి ప్రధాన ఉపనది అయిన భీమానదికి ఉపనది. ఇది తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ సమీపం లో ఉన్న అనంతగిరి కొండలలో జన్మించింది. తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ప్రవహించే దక్కన్ పీఠభూములలోని ఇతర నదుల మాదిరిగా కాకుండా కాగ్నా నది తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల గుండా పశ్చిమ దిశలో ప్రహించి కర్నాటక రాష్ట్రంలోని కాలబురిగి జిల్లాలోని వాడి సమీపంలో భీమానది లోకలుస్తుంది.
మహారాష్ట్ర లోని భీమాశంకర్ పర్వత శ్రేణులలో పుట్టి ఆగ్నేయ దిశగా ప్రవహిస్తున్న భీమానదితో కలిసి ఘోడ్ నది, సీనానది, భీమానది, ఇంద్రయాని నది, మూల మూతానది, నీరా ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్రలోని పడమటి కనుమలలో మహదేవ్ పర్వత శ్రేణులలో పుట్టి ఆగ్నేయ దిశగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది లో నిర్వృత్తి సంగమం దగ్గర కలుస్తూ అక్కడి నుండి ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, మూసినది, పంచగంగా, వర్ణ యేర్ల, దిండి,హాలియానది, పల్లేరునది, మున్నేరు అనేక ఉపన దులను తనలో కలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని దివిసీమ లోని హంసలదీవి వద్ద సముద్రుడైన బంగాళాఖాతంలో కలుస్తుంది.తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా, వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండలలో జన్మించి ఎన్నో జీవ నదులతో కలుస్తూ, ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుంటూ ఎన్నో జీవ రాశులకు ప్రాణాధారమై, ఎన్నో జలచరాలకు నివాసమైంది కాగ్నానది.
ఇదికూడా చదవండి…