అధికారుల వేట.. వెనక్కితగ్గిన అక్రమార్క మూక

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అధికారుల వేట.. వెనక్కితగ్గిన అక్రమార్క మూక
– నాపరాతి అక్రమ తవ్వకాలపై కొరడా
– యంత్రాలను సీజ్ చేసిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అధికారులు తనిఖీ వేట చేస్తున్నారని అక్రమార్కులు వెనక్కితగ్గారు. మంగళవారం తాండూరు మండలంలో నాపరాతి అక్రమ తవ్వకాలపై అధికారులు కొరడా జులిపించారు. గత కొన్ని రోజుల నుంచి మండలంలోని. మల్కాపూర్, సంగెంకలాన్, కోటబాస్పల్లి గ్రామాల్లోకి ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్లను ఆసరా చేసుకుని తవ్వకాల జోరును పెంచేశారు. గుట్టలను తొలగిస్తూ ప్రభుత్వ ఆధాయానికి భారీ గండి కొడుతున్నారు. ఇటీవల అక్రమ తవ్వకాలపై పత్రికల్లో వరుస కథనాలు కూడ వస్తున్నాయి. ఇందుకు తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు స్పందించి అధికారులను తనిఖీలకు ఆదేశించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం తాండూరు రెవెన్యూ ఇను స్పెక్టర్ రాజారెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీల వేట ప్రారంభించారు. మల్కాపూర్ సహాకార సంఘం సోసైటీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్వకాలను చేపడుతున్న యంత్రాలను సీజ్ చేశారు. మరోవైపు అధికారులు తనిఖీల వేట చేస్తున్నారని గుర్తించిన అక్రమార్కులు అంతా గప్ చుప్ అయ్యారు. అనుమతుల్లేకుండా ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న తవ్వకాలను నిలిపి వేసి యంత్రాలను కూడ అక్కడి నుంచి తరలించారు. దీంతో మంగళవారం ఆయా గ్రామాల్లో అక్రమ తవ్వకాలకు కళ్లెం పడింది.