టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలు అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలు అభివృద్ధి
– పంచాయతీలకు రూ. 50లక్షలు
– మళ్లీ పైలెట్ ఘన విజయానికి అందరు కృషి
– రీడింగ్ రూమ్స్ ఏర్పాటుకు ప్రణాళికలు
– వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌తోనే గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో నియోజకవర్గంలోని పంచాయతలకు నిధుల వరద వస్తోందన్నారు. గురువారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో సర్పంచ్ మళ్లీశ్వరీ గౌడ్ సమక్షంలో రాజుగౌడ్‌తో యువకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంనద్నారు. పల్లె ప్రగతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. టీఆర్ఎస్‌ పాలనలో గ్రామాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో పంచాయతీలకు నిధుల వరధ వస్తోందన్నారు. ప్రతి పంచాయతికి రూ. 50లక్షల వరకు నిధులు మంజూరు కాబోతున్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, భారీ మెజార్టీతో ఘన విజయం సాధించేలా అందరు కృషి చేయాలన్నారు. మరోవైపు గ్రంథాలయం తరుపున 40 రీడింగ్‌ ఫర్ రూమ్స్ కోసం ప్రతిపాధనలు పంపడం జరిగిందన్నారు. ఇందులో తాండూరు నియోజకవర్గానికి 12 వరకు రావచ్చన్నారు. దీంతో చెంగోల్‌ లో కూడ రీడింగ్‌ రూం ఏర్పాటుకు చొరవ చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మయ్య, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.