ఎస్జీఎఫ్ఐ తాండూరు జోన్ కార్యదర్శిగా బి. నరేందర్
– జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపిక
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) తాండూరు జోన్ కార్యదర్శిగా కరణ్ కోట్ జిల్లా పరిషత్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు బి.నరేందర్ ఎంపికయ్యారు. గురువారం వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. 2022-24 విద్యాసంవత్సరానికి గాను తాండూరు జోన్ కు సంబంధించి తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు జరిగే క్రీడా పోటీలకు ఆయన కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. తాండూరు జోన్ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా బి. నరేందర్ సంతోషం వ్యక్తం చేయగా పలువురు ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

