మార్కెట్ కమిటి మహర్ధశకు కృషి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ కమిటి మహర్ధశకు కృషి..!
– రెండేళ్ల కాలంలో యార్డు అభివృద్ధి
– రూ. 40 కోట్లతో కొత్త యార్డు నిర్మాణం
– మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్‌ కమిటికి మహర్థశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరిగిందని కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. తాండూరు మార్కెట్ కమిటికి రాజీనామా చేసిన పట్లోళ్ల బాల్ రెడ్డి గురువారం కమిటి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో 2024 జులై 8వ తేదిన మార్కెట్ కమిటి చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈనెల 14వ తేది వరకు మార్కెట్ కమిటి చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు. తన పదవి కాలంలో తాండూరు మార్కెట్ కమిటి అభివృధ్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. బాధ్యతలు చేపట్టిన కొత్తలో రూ. 5కోట్ల 33లక్షల 98వేల 565ల ఆధాయం ఉండగా దానిని రూ. 10కోట్ల 18లక్షల 37వేల 219ల ఆధాయం పెంచడం జరిగిందని వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 4కోట్ల 25లక్షల లక్ష్యానికి గాను రూ. 6కోట్ల 77లక్షలు సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా డీఎఫ్ నిధులు రూ. 10కోట్లతో యార్డు నిర్మాణం చేపట్టడం జరిగింది వివరించారు.

అదేవిధంగా మార్కెట్ యార్డులో రూ. 29కోట్లతో 100 షాపులు, కవర్‌ షెడ్లు, సీసీ రోడ్లు, ప్రహారి నిర్మాణం చేపట్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హాయంలో కొత్త మార్కెట్ కమిటి మంజూరుకు, శిలాఫలాకాలకే పరిమితం కాగా.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో కొత్త మార్కెట్ యార్డు నిర్మాణం చేపట్టం జరిగిందని తెలిపారు. రైతులకు కోర్టులో కేసు వేసినా కూడా సంప్రదింపులు చేసి 6నెలల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా రూ. 43 కోట్లు అవసరం ఉండగా రూ. 15 కోట్ల, 5లక్షలు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. వేవ్ బ్రిడ్జి, సబ్‌ స్టేషన్, 82 దుకాణాలు, ప్రహారి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ 19నెలల కాలంలో రైతులతో పాటు వ్యాపారులకు, హామాలి కార్మికుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. 2007-08 నుంచి 2024-25వరకు మార్కెట్ కమిటి కార్యాలయంలో ఇస్తున్న ఫించన్‌ పేమెంట్‌కు సంబంధించి రూ. 6కోట్ల ఫెన్షన్ రియంబర్స్‌ మెంట్‌ రావాల్సి ఉందని తెలిపారు. తనకు మార్కెట్ కమిటిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉన్నారు.

చత్రపతి శివాజీ మహారాజ్‌కీ జై..!