శంక‌ర్‌నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

రేళ్ల‌గ‌డ్డ తాండ స‌ర్పంచ్ శంక‌ర్ నాయ‌క్ మృతి
– ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గం యాలాల మండ‌లంలోని రేళ్ల‌గ‌డ్డ తాండాకు చెందిన స‌ర్పంచ్ శంక‌ర్ నాయ‌క్ మృతి చెందారు. ఆదివారం ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి తాండాకు చేరుకున్నారు. శంక‌ర్ నాయ‌క్ భౌతిక ఖాయానికి పూల‌మాల వేసి అంజలి ఘ‌టించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌కు రూ. 5వేల ఆర్థిక స‌హాయం అందించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ శంక‌ర్ నాయ‌క్ కుటుంబాన్ని ప్ర‌భుత్వం త‌రుపున ఆదుకుంటామ‌ని హామి ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్య‌ద‌ర్శి క‌ర‌ణం పురుషోత్తంరావు, యాలాల పీఏఎస్ చైర్మ‌న్ సురేంద‌ర్ రెడ్డి, మండ‌ల పార్టీ అధ్య‌క్షులు సిద్రాల శ్రీ‌నివాస్, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు ఉన్నారు.