ఫాతిమా షేక్ సేవలు చిరస్మరణీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఫాతిమా షేక్ సేవలు చిరస్మరణీయం
– పాఠ్యపుస్తకాలలో జీవిత చరిత్ర ఉంచాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారతదేశం మొట్ట మొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు ఫాతీమా షేక్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌వీ తాండూరు ఇంచార్జ్ పి. జిలాని ఆధ్వర్యంలో పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు ఫాతిమా షేక్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించి… విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం)లు హాజరై బహుముతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫాతిమా షేక్ ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలుగా సమాజానికి ఎంతో సేవ చేశారని అన్నారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలో ముద్రించాలని, జయంతిని అధికారంగా నిర్వహించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఫెరోస్ ఖాన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యక్షులు ముజార్, యువనాయకులు డేవిడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.