ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్
– తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. టీఎస్ఎల్పీఆర్బి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్షల (మెయిన్స్) తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విజ్ఞప్తి మేరకు తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీకి, కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టీఎస్పీఎల్ఆర్బీ వెల్లడించింది.

