కట్ట మైసమ్మ దేవాలయ పునర్ నిర్మాణానికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

కట్ట మైసమ్మ దేవాలయ పునర్ నిర్మాణానికి తోడ్పాటు
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
– దేవాలయంలో భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని శ్రీ కట్ట మైసమ్మ దేవాలయ పునర్ నిర్మాణానికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శనివారం దేవాలయంలో వెలసిన అమ్మవారిని మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తెలుగుదేశం పార్టీ తాండూరు ఇంచార్జ్ సూరజ్ సింగ్ ఠాకూర్ తదితరులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్ట మైసమ్మ దేవాలయ పునర్ నిర్మాణానికి రూ. 25 లక్షల ఖర్చు అవుతుందని అన్నారు. ఇందులో దాతలు తోడ్పాటు అందించాలని, తమ వంతు సహకారం కూడ ఉంటుందని అన్నారు. అనంతరం దేవాలయ కమిటి సభ్యులు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, సూరజ్ సింగ్ ఠాకూర్ లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యదర్శి సుధాకర్, మాజీ కౌన్సిలర్ రమేష్, దిలీప్ సింగ్, నర్సింలు, ప్రకాష్, బీజేపీ నాయకులు భాను పవార్, పాపయ్య, రాములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.