రొడ్డు ఇలా.. ముందుకెళ్లేదేలా..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

రొడ్డు ఇలా.. ముందుకెళ్లేదేలా..!
– బుర‌ధ‌మ‌యంగా అంతారం – తాండూరు రోడ్డు
– రోడ్డు మ‌ద్య‌లో ఇరుక్కుపోయిన ఆటో
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బుర‌ద‌మ‌యంగా మారిన రోడ్డులో ఇరుక్కుపోయిన ఓ ఆటో డ్రైవ‌ర్ తంటాలు ప‌డ్డాడు. ముందుకెళ్ల‌లేక‌.. వెన‌క్కి వెళ్ల‌లేక అవ‌స్థ‌లు ప‌డ్డాడు. ఈ సంఘ‌ట‌న తాండూరు ప‌ట్ట‌ణం అంతారం రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. గ‌త మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో తాండూరు – అంతారం రోడ్డు బుర‌ధ‌మ‌యంగా మారింది. ఈ మార్గంలో వ‌చ్చే వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. సోమ‌వారం సాయంత్రం అంతారం వైపు నుంచి తాండూరుకు వ‌స్తున్న ఓ ఆటో బుర‌ధ‌లో కూరుకుపోయింది. దానిని అలాగే ముందుకు క‌ద‌లించే క్ర‌మంలో ఆటో గేరు బాక్స్ ధ్వంస‌మైపోయింది. ఆటో డ్రైవ‌ర్ రోడ్డుమ‌ద్య‌లోనే ఉండిపోయాడు. వేరే మార్గం లేక ఆటోలో ఉన్న సంచుల‌ను కింద‌వేసి వేరే వాహ‌నంలో త‌ర‌లించాడు. దీంతో మార్గంలో ప్ర‌యాణించే వారు మాట్లాడుతూ గ‌త నాలుగు రెండు, మూడు నెల‌లుగా రోడ్డు మ‌ర‌మ్మ‌త్తుల ప‌నులు న‌త్త‌న‌డ‌క సాగుతున్నాయ‌న్నారు. వ‌ర్షాలు జోరుగా కురుస్తుండడంతో రోడ్డు బుర‌ధ మ‌యంగా మార‌డంతో రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌రు. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌డ‌గానే రోడ్డు మ‌ర‌మ్మ‌త్తుల ప‌నులు వేగవంత‌గా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టిసారించాల‌ని ద‌స్త‌గిరిపేట్ కు చెందిన టీఆర్ఎస్ నాయ‌కులు అంబ్రేష్ ముదిరాజ్ విజ్ఞ‌ప్తి చేశారు.