మార్కండేయుని సేవలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కండేయుని సేవలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– జయంతి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు
– పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ 

తాండూరు, దర్శిని ప్రతినిధి: మార్కండేయ స్వామి సేవలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరించారు. మంగళవారం పట్టణంలోని కోడంగల్ రోడ్డు మార్గంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు తదితరులతో మార్కండేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం పద్మశాలి సంఘానికి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, కౌన్సిలర్లు రాము, వెంకన్న గౌడ్, బోయరవి, ప్రవీణ్ గౌడ్, నాయకులు సిద్రాల శ్రీనివాస్, అనంతయ్య, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, వెంకటయ్య, సుధాకర్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.