జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ
– ఎస్పీ తండ్రికి నివాళులు అర్పించిన మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జిల్లా ఎస్పీ తండ్రి హనుమారెడ్డి ఇటీవల మరణించారు. ఆదివారం సూర్యాపేట్ జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామంలో కోటిరెడ్డి తండ్రి దశదిన కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గ్రామానికి చేరుకుని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని పరామర్శించారు. ఎస్పీ తండ్రి హనుమారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ వెంట బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు, బీఆర్ఎస్ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్ తదితరులు ఉన్నారు. వారు కూడ జిల్లా ఎస్పీతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు.