మ‌రి కొన్నిగంట‌ల్లో శాంతి స‌మావేశం

తాండూరు వికారాబాద్

నేడు తాండూరులో శాంతి స‌మావేశం
– హాజ‌రుకానున్న జిల్లా ఎస్పీ నారాయ‌ణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిది : వ‌చ్చే వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను పుర‌ష్క‌రించుకుని నేడు తాండూరు ప‌ట్ట‌ణంలో శాంతి స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్‌రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తాండూరు డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండ‌లంలో ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏర్పాటు చేసిన స‌మావేశానికి జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌, అడిష‌న‌ల్ ఎస్పీ ర‌షీద్‌లు హాజ‌రువున్న‌ట్లు చెప్పారు. కావున హిందు ఉత్స‌వ సమితి స‌భ్యులు, మండ‌ల‌పాల నిర్వ‌హ‌కులు, వివిధ సంఘాల ప్ర‌తినిధులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ హాజ‌రుకావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.