బిర్కడ్ రఘుకు బీసీ నేత పరామర్శ
– ఇంటికెళ్లి పలకరించిన కందుకూరి రాజ్ కుమార్
– ప్రమాదం, ఆరోగ్య పరిస్థితిపై ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బిర్కడ్ రఘును బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పరామర్శించారు. గత రెండు రోజులు క్రితం బిర్కడ్ రఘు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ జాయ్ అసుపత్రిలో సర్జరీ చికిత్స అనంతరం ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బిర్కడ్ రఘు నివాసానికి వెళ్లారు. బిర్కడ్ రఘును కలిసి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కూడ ఆరా తీశారు. ప్రమాదం జరిగిందని దిగులు పడొద్దని.. ఆత్మస్థైర్యంగా ఉండాలని రాజ్ కుమార్ బిర్కడ్ రఘుకు ధైర్యం చెప్పారు. రాజ్ కుమార్ వెంట బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్, వెంకట్, భాస్కర్, హరి ప్రసాద్ తదితరులు ఉన్నారు.

