ముమ్మరంగా కంటి వెలుగు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ముమ్మరంగా కంటి వెలుగు
– పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
– విస్తృతంగా ప్రచారం చేయాలి
– శిబిరాలను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పరీక్షలను ముమ్మరం చేయాలని తాండూరు మున్సిపల్ అధికారులు అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ అశోక్ కుమార్ అదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి పట్టణంలోని కంటి వెలుగు శిబిరాలను సందర్శించారు. పట్టణంలోని మల్ రెడ్డి పల్లి, విజయ విద్యాలయ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మేనేజర్ నరేందర్ రెడ్డి వైద్య అధికారులు, సిబ్బందితో మాట్లాడి కంటి పరీక్షలపై ఆరా తీశారు. కంటి వెలుగు పరీక్షలను ముమ్మరం చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి కంటి వెలుగు శిబిరాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. ఆశ వర్కర్లు, ఆర్పీల సహకారం తీసుకోవాలన్నారు. కంటి పరీక్షలు పక్కడ్బందిగా నిర్వహించాలాన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ క్యాంపు ఇంచార్జ్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ కృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.