రన్నింగ్ బస్సులో కండక్టర్‌కు గుండెపోటు
– ఆసుపత్రికి తరలిస్తుండగా హఠాన్మరణం
– తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : రన్నింగ్ బస్సులో సర్వీసు అందిస్తున్న ఓ కండక్టర్ గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా హఠన్మారణం చెందాడు. ఈ సంఘటన తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలో చోటు చేసుకుంది. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన దేశ్ ముఖ్ సంతోష్ కుమార్ (38) తాండూరు డిపోలో 2009 నుంచి కండక్టర్‌గా పనిచే చేస్తున్నారు. కొన్నేండ్ల నుంచి తాండూరులోనే నివాసం ఉంటూ ఆర్టీసీ కండక్టర్ గా జీవనం సాగిస్తున్నారు. అయితే బుధవారం తాండూరు నుంచి క్యాద్గిరాకు వెళ్లే బస్సులో కండక్టర్ సర్వీసుకు వెళ్లారు. బషీరాబాద్ మండలంలోని ఇందర్ చెడ్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే సంతోష్ కుమార్ కుప్పకూలి పడిపోయారు. డ్రైవర్‌తో పాటు స్థానికులు గమనించ బషీరాబాద్‌లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్య సిబ్బంది గుండెపోటు వచ్చినట్లు అనుమానించారు. వెంటనే మెరుగైన వైద్య పరీక్షల కోసం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కండక్టర్ సంతోష్ కుమార్ మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న దీ మేనేజర్ సమత, అధికారులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన కండక్టర్ కు భార్య కావేరి. ఒక కూతురు. కుమారుడు ఉన్నట్లు తెలిసింది.

