గ్రేట్.. ఆఫ్రీన్ బేగం..!
– తాండూరు గెస్ట్ లెక్చరర్‌కు పీహెచ్‌డీ
– వికారాబాద్ జిల్లాలోనే మొదటి సారి
– అరుదైన ఘనతకు అభినందల వర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణానికి చెందిన ఆఫ్రీన్ బేగం అరుధైన ఘనత సాధించారు. తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమె ఫీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సీటి ద్వారా ఈ పట్టాను అందుకున్నారు. తాండూరు నుంచి వికారాబాద్ జిల్లాలోనే మొదటి సారి.. అతి చిన్న వయస్సుల్లో పీహెచ్‌డీ పొందినట్లు ఘనత సాధించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన మహమ్మద్ ఖాజా మియా కూతురు ఆఫ్రీన్ భేగం 1వ తరగతి నుంచి పదో తరగతి(ఉర్దూమీడియాం) వరకు తాండూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్‌ను తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(ఉర్దూ మీడియం) పూర్తి చేశారు. తాండూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం(ఉర్దూ మీడియం) పూర్తి చేశారు. తాండూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. అయితే 2017లో మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో ఎం.కాం చేశారు. 2018లో పీహెచ్‌డీలో జాయిన్ అయ్యారు. కామర్స్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల పెట్టుబడి ప్రవర్తన అనే అంశంపై పరిశోధన చేసి సబ్మిషన్ చేశారు. యూనివర్సిటీలోని అసోసియేట్ ఫ్రోఫెసర్ డా.ఎండి సాదత్ షరీఫ్ పర్యవేక్షణలో సబ్మిషన్ చేశారు. ఈ మేరకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆఫ్రీన్ బేగంకు పీహెచ్‌డీని అందించింది. గతనెల జనవరి 24న వైవా-వోస్ పూర్తి చేసి.. ఈనెల 6న పీహెచ్‌డీకి ఆఫ్రీన్ బేగం అర్హులైనట్లు ప్రకటించారు. ఇటీవలే ఆఫ్రీన్ బేగంకు పీహెచ్‌డీని అందజేశారు. వికారాబాద్ జిల్లాలోనే మొదటి సారి, అతి చిన్న వయస్సులో పీహెచ్ పట్టా పోందిన అద్యాపకురాలుగా ఆఫ్రీన్ బేగం ఘతన సాధించారు. తాండూరు నుంచి కూడా ఆఫ్రీన్ బేగం మొదటి సారి పీహెచ్‌డీ అందుకున్న ఘనత సాధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉర్దూ మీడీయంలో చదువుకుని పీహెచ్‌డీ సాధించడం పట్ల పలువురు ఆఫ్రీన్ బేగం గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.. అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

