మహానేత సీఎం కేసీఆర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహానేత సీఎం కేసీఆర్..!
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– ఎమ్మెల్సీ నివాసం వద్ద దూందాంగా జన్మదిన వేడుకలు
– పాల్గొన్న పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశ్‌ కీ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహానేత అంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో సీఎం కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలను దూందాంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్‌ తదితరులతో కలిసి కేక్‌ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. తెలంగాణలో ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నో అద్భుతాలు సృష్టించి.. పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చి దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మెన్ వడ్డే శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింహులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, ప్రవీణ్ కుమార్ గౌడ్, బోయరవి, మణపురం రాము, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మాజీ కౌన్సిలర్స్ సయ్యిద్ జుబేర్ లాల, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షురాలు అనురాధ, నాయకులు పట్లోళ్ళ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, వైస్ ఎంపిపి స్వరూప వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ రవి శిందే, సర్పంచ్ పాండు, కో ఆప్షన్ సభ్యులు షంశోద్దిన్, దావులయ్య, ముత్యాల బలరాం, ఎంపిటిసి రాము, హరిశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, మతిన్, వెంకటయ్య, అశోక్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, ఇర్ఫాన్, రహీళ్ మీర్జా, సల్మాన్ ఖాన్, అజీజ్ లాల, నిసార్ ఖాన్, మొహమ్మద్ ఇమ్రాన్, హష్మీ, మోసిన్, వైస్ చైర్మన్, వివిధ చైర్మన్లు, దేవాలయ చైర్మన్లు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.