సచివాలయ ప్రారంభోత్సవంకు కొత్త ముహుర్తం

తెలంగాణ రాజకీయం హైదరాబాద్

సచివాలయ ప్రారంభోత్సవంకు కొత్త ముహుర్తం
– పనులను పరీశీలించిన సీఎం కేసీఆర్
– కొత్త తేదిని ఖరారు చేసిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి కొత్త మూహుర్తం నిర్ణయించారు. పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ కొత్త తేదిని ఖరారు చేశారు. ఈ మేరకు వచ్చే నెల ఏప్రిల్‌ 30న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం నూతన సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ (CM KCR) పరిశీలించారు.

నిర్మాణ భవనం చుట్టూ కలియ తిరుగుతూ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించారు. తుది దశలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17నే సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని తొలుత భావించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయింది. దీంతో తాజాగా కొత్త తేదీని నిర్ణయించారు. మరోవైపు జూన్‌ 2న తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు.