టెన్షన్ లేకుండా చదువుకోవాలి
– అనిల్ రాథోడ్ యువసేన అధ్యక్షులు అనిల్ రాథోడ్
– విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించి చేయూత
తాండూరు, దర్శిని ప్రతినిధి: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి టెన్షన్‌లు లేకుండా తపనతో చదువుకోవాలని అనిల్ రాథోడ్ యువసేన అధ్యక్షులు అనిల్ రాథోడ్ అన్నారు. మంగళవారం అనిల్ రాథోడ్ యువసేన ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం తాండూరు మండలంలోని జినుగుర్తి, పెద్దేముల్ మండలంలోని తట్టెపల్లి, అడ్కిచెర్ల, యాలాల మండలంలోని కోకట్, ముద్దాయి పేట్, రాస్నం, బషీరాబాద్ మండలంలోని రెడ్డి ఘనాపూర్, మంతట్టి పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు పరీక్షా అట్టలను పంపిణి చేశారు.

ఈ సందర్భంగా అనిల్ రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థులకు పేదరికం అనేది ఆటంకం కానే కాదన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలను సాధించాలనే తపనతో చదువుకోవాలన్నారు. అప్పుడే అనుకున్నది సాధించవచ్చన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, యాలాల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ చారి, మంబాపూర్ ఎంపీటిపి శ్రీనివాస్, బషీరాబాద్ మండల బీసీ సంఘం అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, అనిల్ రాథోడ్ యువసేన సభ్యులు చందర్ నాయక్, నాసీర్, ఫిరోజ్, నజీర్, దినేష్ రాథోడ్, ప్రశాంత్, వినోద్, సికిందర్, ఆనంద్, జగదీష్, అనార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

