గ్రామాల అభివృద్ధే ధ్యేయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాజీపూర్ సర్పంచ్ వీరన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. గాజీపూర్ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి సీడీపీ ద్వారా రూ. 5 లక్షలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలను మార్చే విధంగా అభివృద్ధి చేయడమే ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


