కాగ్నా చెక్‌డ్యాం పక్క నుంచి గండి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కాగ్నా చెక్‌డ్యాం పక్క నుంచి గండి..!
– రెచ్చిపోయిన ఇసుకారులు
– మండిపడుతున్న పట్టణ వాసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై ఎప్పటికప్పుడు జోరుగా విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాండూరు ప్రాంతంలో ఇసుకాసురులు రెచ్చిపోయారు. తాండూరులో ప్రసిద్ది చెందిన కాగ్నానదిలో నిర్మించిన చెక్‌డ్యాం పక్క నుంచి గండి కొట్టారు. ఇసుక రవాణా చేసేందుకు చేసిన కుట్రపై పట్టణ వాసులు మండిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత తాండూరు పట్టణంలోని కాగ్నానదిలో చెక్‌డ్యాం నిర్మించారు. కళ్లముందు కర్నాటకు తరలివెళ్లి కాగ్నానది నీటిని నిల్వ ఉంచాలనే ఉద్దేశంతో చెక్‌డ్యాంను నిర్మించారు. కాని.. నిర్మాణ లోపం వల్ల నది నీరు లీకేజీ అవుతూనే ఉంది. అయితే కాగ్నానది చెక్‌డ్యాంకు ఇటువైపు గత కొన్నేండ్ల నుంచి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూనే ఉంది. చెక్ డ్యాం వల్ల ఇసుక తరలింపుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దీంతో అక్రమ ఇసుకారులు తెగించి చెక్‌డ్యాంకు గండి కొట్టారు. చెక్‌డ్యాంకు పక్కనుంచి తవ్వకం చేసి ఇసుక నీరు పారేలా చేశారు. కాగ్నానది చెక్‌డ్యాం ఉద్దేశాన్ని కూడ మరి అక్రమ వ్యాపారం కోసం చెక్‌డ్యాంకు పక్కనుంచి గండి పెట్టిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటనపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి తెగించిన అక్రమ వ్యాపారులపై అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తకుండా ఉండడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా కాగ్నాచెక్‌డ్యాం గండిని పూడ్చి.. ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. గండి కొట్టిన వీడియో కింద చూడండి…