విఘ్నేశ్వరుని కృపాకటాక్షం సిద్దించాలి
– గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెంలగాణ రాష్ట్రంలో అందరికి విఘ్నేశ్వరుని కృపాకటాక్షం సిద్దించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అకాంక్షించారు. శుక్రవారం వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులను ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. భద్రేశ్వర చౌక్‌లో, గాంధీనగర్‌లో ప్రతిష్టించిన వినాయకులను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వినాయకయ చవతి ఉత్సవాలను భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అదేవిధంగా సీఏం కేసీఆర్ నేతృతంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మెండుగా జరగాలని, ప్రజలందరికి విఘ్నేశ్వరుని కటాక్షం సిద్దించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవిందర్ గౌడ్, టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనీయర్ నాయకులు రాజుగౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్‌యాదవ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి సాయిపూర్ బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గడ్డలి రవిందర్, మసూద్, బోయరాజు, హరిహరగౌడ్, బంటు మల్లప్ప, బీసీ సంక్షేమ సంఘం కన్వినర్ రాజ్‌కుమార్, టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
