సొంత గూటికి డీసీసీబీ మాజీ చైర్మన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సొంత గూటికి డీసీసీబీ మాజీ చైర్మన్..!
– తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్న లక్ష్మారెడ్డి..?
– తాండూరులో జోరందుకున్న ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని కాంగ్రెస్‌లో వలసల పర్వం జోరందుకుంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఘర్‌ వాపసీ అన్నట్లుగా నేతలను ఆకర్షిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బీజేపీలో కొనసాగుతున్న డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త హల్‌ చల్‌గా మారింది.
మొదటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన లక్ష్మారెడ్డి డీసీసీబీ చైర్మన్ పధవి నుంచి తొలగిపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీలో సరైన ఆదరణ లేకపోవడంతో మూడు నెలలకు ముందు బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మారెడ్డి కాషాయం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తండ్రి బీజేపీలో చేరిన ఆయన కుమారుడు మహిపాల్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్‌లో ఉన్నారు.

గురువారం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా లక్ష్మారెడ్డి కూడా తిరిగి సొంతగూటికి చేరాలని యోచిస్తున్నట్లు తాండూరులో ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోందని తెలుస్తోంది. కాని పట్టుమని మూడు నెలలు కూడా బీజేపీలో లక్ష్మారెడ్డి ఇమడలేక పోయారని పలువురు చర్చించుకుంటున్నారు. కాని ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…

మోగిన ఎలక్షన్ నగారా..!