ఐల‌మ్మ ఉద్య‌మ స్పూర్తి ఆద‌ర్శ‌నీయం : ఎమ్మెల్సీ

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఐల‌మ్మ ఉద్య‌మ స్పూర్తి ఆద‌ర్శ‌నీయం
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
– ఐల‌మ్మ వ‌ర్దంతిలో నివాళులు అర్పించిన నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఉద్య‌మ స్పూర్తి అంద‌రికి ఆద‌ర్శ‌నీయ‌నమ‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ర‌జ‌క సంఘాల ఆధ్వ‌ర్యంలో చాక‌లి ఐల‌మ్మ 36 వర్దంతిని నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని విజ‌య విద్యాల‌య పాఠ‌శాల స‌మీపంలో నిర్వ‌హించిన వ‌ర్దంతిలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి హాజ‌రై మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌తో పాటు నాయ‌కుల‌తో క‌లిసి ఐల‌మ్మ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్య‌మంలో వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ ఉద్య‌మ స్పూర్తి అంద‌రికి ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. సీఎం కేసీఆర్ చాక‌లి ఐల‌మ్మ‌తో పాటు పేద‌ల‌కు అండ‌గా నిలిచిన నాయ‌కుల పేరుతో గౌర‌వ భ‌వ‌నాలు నిర్మిస్తున్నార‌ని తెలిపారు. అదేవిధంగా మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాండూరు ర‌జ‌క సంఘం అభివృద్ధికి నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. భ‌విష్య‌త్తులో కూడ ఎమ్మెల్సీ కోటాతో పాటు మున్సిప‌ల్ నుంచి కూడ నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామ‌ని హామి ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్య‌ద‌ర్శి క‌ర‌ణం పురుషోత్తంరావు, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, టీఆర్ఎస్ నాయ‌కులు గ‌డ్డ‌లి ర‌వీంద‌ర్, మ‌సూద్, బంటు మ‌ల్ల‌ప్ప‌, బోయ‌రాజు, మండ‌ల‌ కోఆప్ష‌న్ స‌భ్యులు శంషోద్దీన్, టీఆర్ఎస్‌వై ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు రాకేష్ తాండ్ర‌, యువ‌నాయ‌కులు అశోక్, సీపీఎం నాయకులు శ్రీ‌నివాస్, బీసీ సంఘం నాయ‌కులు అబ్బ‌ని బ‌స‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.