బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేయాలి
– ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త
– సన్మానించిన జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టేవిధంగా అందరు కృషి చేయాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఆదివారం తాండూరుకు వచ్చిన శ్రీనివాస్ గుప్త ఐవీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ సమక్షంలో యువతతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్తను ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. మరోవైపు రొంపల్లి సంతోష్ కుమార్ ఫార్మ్ లాండ్ తో పాటు వైశ్య ఫెడరేషన్ తాండూరు అధ్యక్షులు కల్వవంశి డ్రైవ్ ఇన్పినిట్ ని కూడ శ్రీనివాస్ గుప్త సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు ఉన్నారు.