అంబలి, మజ్జిగ సేవ భీష్.!

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

అంబలి, మజ్జిగ సేవ భీష్.!
– ఐవీఎఫ్, వాసవి క్లబ్ చేయూత అభినందనీయం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మజ్జిగ, అంబలి చలివేంద్రం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మండు వేసవిలో ప్రజలకు అంబలి, మజ్జిగ సేవ అందించడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్ తాండూరు ఆధ్వర్యంలో ఉచిత అంబరి, మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ మాట్లాడుతూ వేసవిలో అంబలి, మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీమన్నారు. బాటసారులకు అంబలి. మజ్జిగను అందించడం వల్ల మండే ఎండల నుంచి ఉపశమనం పొందుతారన్నారు. ప్రారంభించి వదిలేయండా వేసవి మొత్తం సేవలను అందించడం అభినందనీయమన్నారు. సమాజం మెచ్చిన సేవలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అదేవిధంగా వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ వైశ్య ఫెడరేషన్, వాసవీ క్లబ్ సభ్యుల సహాకారంతోనే నాలుగేళ్లుగా ప్రతి యేడాది సేవాదృక్పథంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. అందరి సహాకారంతో మరిన్ని సేవా తత్పరతను కొనసాగిస్తామని పేర్కొన్నారు. శనివారం కీ.శే. రొంపల్లి వీరేశం స్మారకార్థం మజ్జిగ, అంబలి పంపిణీ చేయడం జరిగిందన్నారు. మరోవైపు చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న సంఘ సభ్యులకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అభినందించి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాము, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోట మురళీ, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, వైశ్య ఫెడరేషన్ కోశాధికారి ఆగీర్ మ హేష్, తాండూరు ఫెడరేషన్ అధ్యక్షులు కేళీగారి ప్రవీణ్, సెక్రటరీ సతీష్, కోశాధికారి గుణవర్ధన్, వాసవి క్లబ్ కోశాధికారి వినయ్, సభ్యులు గురు, రఘురాం తదితరలు పాల్గొన్నారు.