జై.. హనుమాన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జై.. హనుమాన్..!
– తాండూరులో అట్టహాసంగా శోభాయాత్ర
– పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– భారీగా తరలివచ్చిన నాయకులు, భక్త జనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. హనుమాన్, జై.. శ్రీరాం నినాదాలతో తాండూరు పురవీధులు దద్దరిల్లాయి. గురువారం తాండూరులో హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో చేపట్టిన శోభాయాత్ర అట్టహాసంగా కొనసాగింది. పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి భద్రేశ్వర చౌక్, గాంధీచౌక్, ఇందిరా చౌరస్తా వంటి ప్రధాన వీధుల్లో శోభాయాత్ర శోభాయామానంగా ముందుకు సాగింది. శోభాయాత్రలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పల్లకి సేవలో ఊరేగితున్న హనుమాన్‌ను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో హనుమాన్ విగ్రహ ప్రతిమ ఆకర్షణీయంగా నిలిచింది. భక్తులు భారీగా తరలివచ్చి భజన కీర్తనలు, జై హనుమాన్ నామస్మరణతో హోరెత్తించారు.. శోభాయాత్రలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, స్టేషన్‌ హనుమాన్ భజన మండలి సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.