ఘనంగా గుడ్ ఫ్రైడే..!
– చర్చిల్లో ప్రార్థనలు చేసిన క్రైస్తవులు
– పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– క్రైస్తవులకు వరాలు, హామిలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా పట్టణంలోని పలు చర్చిల్లో క్రైస్తువులు ప్రార్థనలు చేశారు. మానవాళిని రక్షించేందుకు దైవకుమారుడిగా అవతరించిన ఏసు క్రీస్తును స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. ఏసు కీర్తనలతో ప్రార్థనలతో చెర్చిలు కిక్కిరిసిపోయాయి. పట్టణంలోని మెథడిస్ట్ చేర్చిలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పాసర్లు, క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ.. శాంతితో కూడిన రాజ్యాన్ని స్థాపించేందుకు ఏసు క్రీస్తూ కృషి చేశారని అన్నారు. ఏసు క్రీస్తూ సన్మార్గంలో అందరు నడిచి ప్రపంచ శాంతిని పంచాలన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, బంటారం సుధాకర్, హరిగౌడ్, తదితరులు ఉన్నారు.
క్రైస్తవులకు ఎమ్మెల్యే వరాలు
మరోవైపు తాండూరులోని క్రైస్తవులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వరాలు ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఎల్డీఎఫ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో నిధులు మంజూరు చేయించారు. తాండూరులోని క్రైస్తవ భవన్కు రూ. 50 లక్షలు, తాండూరు మండలంలో 16 ప్రార్థనా మందిరాల అభివృద్ధికి రూ. 33 లక్షలు, యాలాల మండలంలో 4 ప్రార్థనా మందిరాల అభివృద్ధికి రూ.16 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఇందుకు తాండూరు నియోజకవర్గంలోని క్రైస్తవులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

