తాండూరు అర్చకులకు నంది పురస్కారాలు

తాండూరు వికారాబాద్

తాండూరు అర్చకులకు నంది పురస్కారాలు
– విజయ కుమార్ స్వామికి అలంకార రత్న
– భూకైలాస్ అర్చకుడికి అర్చక పురోహిత భాస్కర బిరుదులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గానికి చెందిన అర్చకులు ఉగాది నంది పురస్కారాలతో పాటు ప్రత్యేక బిరుదులు అందుకున్నారు. తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవస్థాన అర్చకులు విజయ్ కుమార్ స్వామి, భూకైలాస్ దేవాలయ అర్చకులుగా ఎం.రవిశంకర్ స్వామి కొనసాగుతున్నారు. అయితే ఇటీవల హైదరదబాద్‌లోని చిక్కడపల్లిలో త్యాగరాజు ఘనసభలో త్రినయన సంస్కృతి కళానిలయం వారు శోభకృత్ నామ సంవత్సర ఉగాది నంది పురస్కారం, ప్రత్యేక బిరుదు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా భద్రేశ్వర దేవాలయ అర్చకులు విజయ్ కుమార్ స్వామికి ఉత్తమ అర్చక, వైదిక పురోహిత, అలంకార కళారత్న బిరుదుతో పాటు ఉగాది నంది పురస్కారం అందజేశారు. అదేవిధంగా భూకైలాస్ దేవాలయ అర్చకుడు రవిశంకర్ స్వామికి అర్చక పురోహిత భాస్కర బిరుదులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సలహాదారులు సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, జనగామ స్పెఖల్ కలెక్టర్ అరుణ రెడ్డి సమక్షంలో బిరుదులతో పాటు ఉగాది నంది పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అర్చక పురోహితులు విజయకుమార్ స్వామి, రవిశంకర స్వామిలు హర్షం వ్యక్తం చేశారు.