రేపు తాండూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– హాజరుకానున్న రంజిత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరు పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంకు ముహూర్తం ఖరారయ్యింది. మంగళవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పల్లె పల్లెకు పైలెట్, గల్లీ గల్లీకి పైలెట్ కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాలను మండలాలలో ముగించుకున్న తరువాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే తాండూరు పట్టణంలో గల్లీ గల్లీకీ పైలెట్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో తాండూరు పట్టణ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తులసీ గార్డెన్‌లో నిర్వహిస్తున్న పట్టణ స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జ్, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు హాజరవుతున్నారు. కావున పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.