తెలంగాణ విముక్తికి పోరాడిన యోధుడు వల్లభాయ్ పటేల్
– తాండూరులో 71వ వర్దంతి, నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తాండూరు బీసీ సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం తాండూరు బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ ఆదేశాల మేరకు సంఘం ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ 71వ వర్దంతిని జరుపుకున్నారు. రాజ్ కుమార్ నివాసంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొలి హోం శాఖ మంత్రి గా పనిచేసిన వల్లభాయ్ పటేల్ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుడు అని అభివర్ణించారు. నిజాం నిరంశక పాలనకు చరమగీతం పాడిన మనిషిగా పేరుగాంచిన మహనీయుడని కొనియాడారు. త్వరలోనే తాండూరులో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బీసీ సంఘం యువజన సంఘం అధ్యక్షుడు బోయ నరేష్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు బోయ రాధ క్రిష్ణా, టైలర్ రమేష్, అశోక్, అజయ్, సమీ, మతీన్, మహేష్, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
