మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం
– వయోవృద్ధుల ఫిజియోథెరపీ కేంద్రంతో మేలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– జిల్లా ఆసుపత్రిలో కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల మానసిక ఆరోగ్య చికిత్సకు సర్కారు ప్రాధాన్యమిస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా మానసిక ఆరోగ్య చికిత్స కేంద్రంతో పాటు వయోవృద్ధుల ఫిజియో థెరపీ సేవా కేంద్రాలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా సరే మానసిక ఆరోగ్య ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు చికిత్స కేంద్రాలు కీలకంగా ఉంటాయన్నారు. ప్రజల ఆర్యోగం కోసం ప్రభుత్వం ప్రత్యేక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
ఇందులో వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. దీంతో పాటు వయో వృద్ధులకు ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సేవా కేంద్రాన్ని కూడా బాధితుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్క చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ సోమశేఖర్, ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్, హెచ్‌డీసీ మెంబర్ డా. రమణబాబు, వైద్యులు, నేతలు, సిబ్బంది పాల్గొన్నారు.

