ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటు
– డీలక్స్ బస్సు సర్వీసులతో ప్రయాణికులకు మేలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ డిపో అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు ఆర్టీసీ డిపోకు మంజూరైన మూడు ఆర్టీసీ డీలక్స్ కొత్త బస్సు సర్వీసులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బస్సు లో ఎక్కి స్క్రీర్టింగ్ తిప్పి బస్సును నడిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో కొత్త బస్సుల విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తాండూరుకు మంజూరైన కొత్త డీలక్స్ బస్సు సర్వీసులతో ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, డీపో మేనేజర్ సమత, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నాయకులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.