ఎంసెట్ కోచింగ్ సెంటర్‌కు ఎంపీ రంజిత్ రెడ్డి చేయూత
– రూ. 1.5 లక్షల విరాళం అందించిన ఎంపీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంసెట్ కోచింగ్ సెంటర్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చేయూతనందించారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం పట్టణంలోని సమర్ ఫంక్షన్ హాల్ లో 350 మంది విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న లెక్చరర్ల ఫీజు చెల్లించేందుకు ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత ఖర్చుల నుంచి రూ. 1.5లక్షలను అసోసియేషన్ కు విరాళంగా అందజేశారు. మంగళవారం బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు మసూద్ లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కమల్ అతహర్, ఖాలిద్‌లకు ఎంపీ తరుపున విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ రంజిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

