సూపర్ తాండూరు చైర్ పర్సన్..!
– సామాజిక సృహను చాటుకున్న స్వప్నపరిమళ్
– రోడ్డు ప్రమాద బాధితుల వైద్య సాయంకు కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్ప పరిమళ్ సూపర్ అనిపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులకు వైద్య సేవలు అందించేలా తనలోని సామాజిక సృహను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని పంజాగుట్టా ప్రాంతానికి చెందిన కొందరు యువకులు వికారాబాద్ సమీపంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయ సందర్శనానికి వస్తున్నారు. దేవాలయ సమీపంలోని రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన కారును నిలిపి గాయపడిన బాధిత యువకులను పరిశీలించారు. వెంటనే తన ఫోన్ తో స్థానిక పోలీసులకు, 108 అంబులెన్స్ లకు సమాచారం అందించారు. పోలీసుల ద్వారా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించేలా సాయం చేశారు. దీంతో పాటు బాధితులను తరలించే వారితో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సూచించారు. తాండూరు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ చూపిన సామాజిక సృహకు స్థానికులు, విషయం తెలిసిన తాండూరు ప్రజలు ఫిదా అయ్యారు.
ఇవి కూడా చదవండి…
మహిళను కాటేసిన ఎలుక
– రూ. 60 వేల పరిహారం చెల్లింపుకు ఆదేశం
– ఐదేళ్ల తరువాత వినియోదారుల కమీషన్ తీర్పు
https://dharshininews.com/16968

