విద్యార్థుల భవిష్యత్తుకు ప్రోత్సహాం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థుల భవిష్యత్తుకు ప్రోత్సహాం
– ఎంసెట్‌లో ర్యాంకులు సాధిస్తే బహుమతులు
– ఐవీఎఫ్ తెలంగాణ యూత్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ప్రోత్సహం అందించడం జరుగుతుందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త అన్నారు.

బుధవారం తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్‌లో ఉచితంగా నిర్వహిస్తున్న ఎంసెట్ కోచింగ్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. కోచింగ్ తీసుకుంటున్న 350 మంది విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేశారు.

అనంతరం రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎంసెంట్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త సహాకారంతో బహుతులు అందజేస్తామన్నారు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్దపడే విద్యార్థులకు వైశ్య ఫెడరేషన్ తరపున ప్రోత్సహాం అందిస్తామన్నారు. విద్యార్థులు ఎంసెంట్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎసెంట్ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ నిర్వహిస్తున్న ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మైనార్టీ నాయకులు డా.జియాఉద్దీన్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.