టెన్త్లో సూపర్ ‘టాలెంట్’..!
– అధరగొట్టిన ఎస్కేవీటీఎస్
– 9.8 జీపీఏ సాధించిన స్టూడెంట్స్
– అత్యధికంగా ఏ 1 గ్రేడ్ స్థాయిలో ఉత్తీర్ణత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సూపర్ టాలెంట్ ప్రదర్శించారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో టాపర్లుగా నిలిచారు. స్కూల్కు చెందిన కరణం చిన్మయి 9.8 జీపీఏ సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. ఆమెతో పాటు ఎన్.గౌరీ 9.7 జీపీఏ, ఎన్. నిఖిత 9.7 జీపీఏ, యశస్విని రెడ్డి- 9.7 జీపీఏ, తోడ్లి సౌమ్య- 9.7 జీపీఏలు సాధించారు. ఎం. వెంకట సుధీక్ష- 9.5 జీపీఏ సాధించారు. అదేవిధంగా స్కూల్కు చెందిన 6 మంది 9.3 జీపీఏ, 4 మంది 9.2 జీపీఏ, 7 మంది 9.0 జీపీఏ, మిగతా ప్రతి ఇద్దరిలో కూడ 9.0 జీపీఏలు సాధించి ప్రభంజనం సృష్టించారు. అత్యధికంగా ఏ 1 గ్రేడ్, ఏ 2 గ్రేడ్ ఫలితాలను సాధించి విద్యార్థులు స్కూల్ ప్రతిష్టను అగ్రస్థానంలో నిలిపారు.
ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ధ్యావరి విష్ణువర్దన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, ద్యావరి జయవర్దన్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థుల కొంగ్రొత్త భవిష్యత్తుకు పునాధులు వేస్తూ శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సత్తా చాటుతుందన్నారు. అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఉత్తమ ఫలితాలను సాధిస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్. రమేష్, పి. చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


