పండగలా సీఎం కప్‌ పోటీలు

తాండూరు రాజకీయం వికారాబాద్

పండగలా సీఎం కప్‌ పోటీలు
– క్రీడాకారుల ప్రతిభ వెలికితీతకు దోహదం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఉత్సహాంగా పాల్గొన్న క్రీడాకారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్‌ పోటీలు తాండూరులో పండగలా ప్రారంభమయ్యాయి. సోమవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పోటీలసు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా పోటీలకు తాండూరు మండలం, పట్టణం నుంచి వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్రీడాకారులకు కరచాలనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉత్సహాంగా పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్‌ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభను చాటి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలలో క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జెడ్పీటీసీ గౌడి మంజుల, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్‌ రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, హరిహరగౌడ్, ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి, సీఎం కప్‌ పోటీల కమిటి సభ్యులు, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.