భార్య కోసం పదవి త్యాగం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భార్య కోసం పదవి త్యాగం..!
– బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష పదవికి రాజీనామా
– రాము నాయక్‌కు నాయకుల అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాజకీయాల్లో పదువులు అంటే అందరికి మోజెక్కువ. ఒకే ఇంట్లో రెండుకు మించి పదవులు పొంది కొనసాగుతున్నా వారు ఎందరో ఉన్నారు. పదవులపై విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా పనిచేస్తుంటారు. దానికి భిన్నంగా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామునాయక్ ఆదర్శంగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసి షాక్‌ ఇచ్చారు. అసలు కారణం చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు. బషీరాబాద్‌ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ పదవిని రాము నాయక్ సతీమణి శాంతిబాయిని నామినేట్ చేశారు. దీంతో ఇంట్లో ఇద్దరికి రెండు పదవులు ఉండరాదని రాము నాయక్ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అందజేశారు. రాము నాయక్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ నేతలు అభినందించారు. మరోవైపు రాము నాయక్ స్థానంలో ఇందర్‌ చెడ్‌ నర్సిరెడ్డి(రాజు)కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి…
సూపర్ స్టార్‌తో పైలెట్..!
– రజనీకాంత్ ఇంటికి వెళ్లిన రోహిత్ రెడ్డి భేటీ
– గృహప్రవేశానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే
https://dharshininews.com/17449
chaithany collage