టీఆర్ఎస్ సంక్షేమం ఆద‌ర్శం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్ సంక్షేమం ఆద‌ర్శం..!
– విజ‌య గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతం అంద‌రి బాధ్య‌త‌
– గ్రామాలు, వాడ‌ల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లిరావాలి
– ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమం ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని ఉంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వహించే విజ‌య గ‌ర్జ‌న స‌భను విజ‌య‌వంతం చేసే బాధ్య‌త ప్ర‌తి కార్య‌క‌ర్త‌పై ఉంద‌ని అన్నారు. బుధ‌వారం తాండూరులోని హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్‌లో జ‌రిగిన టీఆర్ఎస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ విస్తృతస్థాయి స‌మావేశంతో పాటు విజ‌య గ‌ర్జ‌న స‌భ స‌న్న‌హాక స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్ అభివృద్ధి ప‌థ‌కాల‌తో పాటు ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశార‌ని తెలిపారు. అభివృద్ధిలో.. సంక్షేమంలో టీఆర్ఎస్ ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాయ‌న్నారు. టీఆర్ఎస్
చేస్తున్న అభివృద్ధిని.. సంక్షేమాన్ని ఓర్వ‌లేక ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శల‌ను తిప్పికొట్టాల‌న్నారు. అదేవిధంగా వ‌చ్చేనెల న‌వంబ‌ర్ 15వ తేదిన వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హిస్తున్న టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను వియతం చేయాల్సిన బాధ్య‌త పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లంద‌రిపై ఉంద‌న్నారు. స‌మావేశానికి గ్రామ‌, గ్రామంతో పాటు ప‌ట్ట‌ణంలోని ప్ర‌తి వార్డు నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను పెద్ద ఎత్తున త‌ర‌లించి విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. అంత‌కుముందు స‌భా వేధిక‌పై టీఆర్ఎస్ పార్టీ ప‌టిష్ఠ‌త‌కు కృషి చేసిన స్వ‌ర్గీయ నాయ‌కుల‌కు మౌనం పాటించి నివాళులు అర్పించారు. దీనికంటే ముందు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తెలంగాణ త‌ల్లి చిత్ర‌ప‌టానికి పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్క‌రించారు.
ఈ కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య మౌళిక వ‌స‌తుల కల్ప‌న సంస్థ చైర్మ‌న్ ప‌ర్యాద కృష్ణ‌మూర్తి, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ గౌడ్, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల న‌ర్సింలు, ఎంపీపీలు బాలేశ్వ‌ర్ గుప్త, క‌రుణ అజ‌య్ ప్ర‌సాద్, మార్కెట్ క‌మిటి చైర్ ప‌ర్స‌న్ అరుణ గోపాల్ రెడ్డి, తాండూరు మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, టీఆర్ఎస్ తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), తాండూరు మండ‌ల అధ్య‌క్షులు రాందాస్, పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులు కోహీర్ శ్రీ‌నివాస్ యాదవ్, తాండూరు మండ‌ల అధ్య‌క్షులు రాందాస్, యాలాల మండ‌ల అధ్య‌క్షులు మ‌ల్లారెడ్డి,
టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, సీనీయ‌ర్ నాయ‌కులు రాజుగౌడ్, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, న‌ర్సిరెడ్డి, మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్నమాల‌, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల నీర‌జాబాల్‌రెడ్డి, మ‌హిళ నాయ‌కురాలు, కౌన్సిల‌ర్ విజ‌య‌దేవి, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు, నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ గ్రామాల స‌ర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్ష‌న్ స‌భ్యులు, ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.