క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు
– విద్యార్థులు లక్ష్యాల కోసం శ్రమించాలి
– టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్
– ఉత్సహాంగా పీపుల్స్ ఫేర్ వెల్ పార్టీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తమ లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించాలని టీపీపీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ తాండూరు ఇంచార్జ్, తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాల అధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మినీ భూకైలాస్ ఫంక్షన్ హాల్ లో పీపుల్స్ కళాశాల విద్యార్థులు ఫేర్ వెల్ పార్టీని జరపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎం.రమేష్ మహరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి.. మాట్లాడుతూ విద్యార్థులు తమకు గుర్తింపు ఇచ్చే విద్యపై శ్రద్ధ వహించాలన్నారు. అనుకున్న లక్ష్యాల పట్ల నిరంతర శ్రమను అలవర్చుకోవాలన్నారు. క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటోలు అందించి సత్కరించారు. మరోవైపు ఫేర్ వెల్ పార్టీ సందర్భంగా కళాశాల విద్యార్థులు ఉత్సహాంగా ఆడి పాడారు. విద్యార్థిని విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీపీపీ. సీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు జనార్దన్ రెడ్డి, వి. నర్సింలు, ప్రిన్సిపల్ సత్యానంద్ కుమార్, అద్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
కాళ్లకు కరెంటు చెప్పులు..!
– అమ్మాయిల కోసం రూపకల్పన
– ఆకతాయి వేషాలేస్తే అంతే సంగతులు
– చెప్పుల ధర కూడా అందుబాటులోనే
https://dharshininews.com/17455

chaithany collage