మట్టి వినాయకులే శ్రేష్ఠం.. శుభకరం..!
– కాలుష్య రహిత గణేషులను పూజించాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మట్టి వినాయకులను పూజించడమే శ్రేష్ఠం, శుభకరమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ గంజ్ ఆవరణలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై భక్తులకు, ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయకులను ప్రతిష్టాపించి పూజించడం ఎంతో శుభకరమన్నారు. అంతేకాకుండా మట్టి గణేషులను పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ప్యారిస్సా ప్లాస్టర్, రసాయనాలను వినియోగించి తయారు చేసిన వినాయకులలో ఎన్నో అనర్థాలు జరుగుతాయని అన్నారు. పైగా నిమజ్జనంతో కాలుష్యం ఏర్పడుతోందన్నారు. కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మట్టిని వినాయకులను ప్రతిష్టాపించి పూజించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు, ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షులు తులజారాంసింగ్, అధ్యక్షులు కల్వ రాధా కృష్ణ, మెంబర్లు కల్వ అశోక్, బంటారం సుధాకర్, సల్లా దామోదర్, కుంచం మురళి, మార్కెట్ డైరెక్టలు భాను, ప్రశాంత్, రవిశంకర్ పాటిల్, దీ గీన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

