జుబేర్‌లాలను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి

తాండూరు

జుబేర్‌లాలను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణానికి చెందిన టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు, మాజీ కౌన్సిల‌ర్ జుబేర్ లాల‌ను ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌కు గురైన జుబేర్ లాల ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి జుబేర్ లాల నివాసానికి చేరుకున్నారు. జుబేర్ లాల‌ను ప‌ల‌క‌లించి ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీరారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ ల‌క్ష్మారెడ్డి, మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, నాయ‌కులు అబ్దుల్ రావుఫ్, సిధ్రాల శ్రీనివాస్, తాటికొండ పరిమల్ గుప్త‌, కౌన్సిల‌ర్ ముక్తార్ నాజ్ తదితరులు ఉన్నారు.