గుళ్లకు కన్నం వేసిన పాపిష్టులు..!
– రెండు దేవాలయాల్లో దొంగల చేతివాటం
– హుండీలలో నగదు, కానుకల ఆపహరణ
– యాలాల యండలంలో వరుస చోరీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా పుణ్యం కోసం దేవాలయాలకు వెళతారు. కానీ ఈ పాపిస్టులు గుడిలకే కన్నం వేశారు. దేవాలయాల్లో చేతివాటం ప్రదర్శించి హుండీలలో నగదును అపహరించారు.

యాలాల మండలంలో రెండు దేవాలయాల్లో గుర్తుతెలియని దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. యాలాల మండలం సంగెంకుర్దు పరిధిలో సంగమేశ్వరాలయం పాటు శనీశ్వర దేవాలయాలు ఉన్నారు. ప్రతి రోజు ఆలయంలో పూజారి సంగమేశ్వరునికి, శనీశ్వరునికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా దర్శించుకుంటున్నారు. అయితే మంగళవారం దేవాలయం మూసి వేసిన తరువాత రాత్రి వేళ గుర్తుతెలియని దొంగలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.

సంగమేశ్వర దేవాలయం, శనీశ్వర దేవాలయంలో దొంగతనం చేశారు. ఆయా దేవాలయాలలో ఉన్న హుండీలను పగులగొట్టారు. సంగమేశ్వర దేవాలయంలో హుండీలో సుమారు రూ.70వేలు, శనీశ్వర దేవాలయంలో సుమారు రూ. 50వేలు ఉన్నట్లు ఆలయ పూజారి తెలిపారు. బుధవారం ఉదయం వచ్చి చూసే సరికి దేవాలయంలో హుండీలు ధ్వంస మైనట్లు గుర్తించారు. వెంటనే దేవాలయ చైర్మన్ తో పాటు యాలాల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయానికి సందర్శించి చోరీ ఏ విధంగా జరిగిందనే విధానాలను పరిశీలించారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు మంగళవారం ఓ ఇద్దరు వ్యక్తులు దేవాలయంను రిక్కి చేసినట్లు ఆలయ పూజారి అనుమానం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

